సిర్పూర్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పిసి గోష్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ మండల కన్వీనర్ అస్లంబిన్ అబ్దుల్లా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకోని నిర్వహించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అసత్యపు ఆరోపణలు చేస్తూ కేసును సిబిఐ కి అప్పగించడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నారని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.