యోగాతో ఆరోగ్యం పదిలం: డిఎస్పి మహేంద్ర రోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మదనపల్లి డిఎస్పి మహేంద్ర తెలిపారు. ఆదివారం 7కు మదనపల్లె డిఎస్పీ ఆఫీసులో సబ్ డివిజన్ లోని పోలీసులతో కలసిఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో యోగాసనాలు నిర్వహించారు. డిఎస్పీ మాట్లాడుతూ..నిత్యం విధుల్లో ఒత్తిడిలో ఉంటామన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, యోగానే అందుకు పరిష్కారం అన్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు. అది మన మనసును ప్రశాంతంగా ఉంచుతుందని డీఎస్పీ తెలిపారు