పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వెంకటేశ్వర కాలనీలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయన జాతీయవాద ఆలోచనలు, అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.