విశాఖలో మంగళవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో సత్యం జంక్షన్ వద్ద రెండు బైక్లు ఢీకొన్నాయి. నేరుగా వెళ్తున్న బైక్ను సిగ్నల్ క్రాస్ చేస్తూ ఇంకో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే స్కూటీ దెబ్బతింది. మరో బైక్ నడిపిన వ్యక్తి సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు