తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ స్థల కేటాయింపు తమ గ్రామ సమీపంలో వద్దంటూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను మంగళవారం సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇలుపూరు పంచాయతీ గ్రామస్తులు కలిశారు. ఇలుపూరు పంచాయతీకి చెందిన పెరిటిపాడు కొన్నెంబట్టు లక్ష్మీపురం పరిసర గ్రామాలకు సంబంధించిన వారు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల వాసులు మాట్లాడుతూ సూళ్లూరుపేటలో ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం తమ గ్రామ సమీపంలో 10 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అయితే తమ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపడితే ఆరోగ్య సమస్యలు