ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు మండలం సత్యనారాయణపురం గోదావరి కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి శుక్రవారం ఉదయం 9:30 సమయంలో పోలీసులకు సమాచారం అందించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి వివరాలు సేకరిస్తున్నారు మృతుడి చేతి పై సత్యాన్ని పచ్చబొట్టు తప్ప అతని వద్ద ఇటువంటి ఆధారాలు లభించలేదని మృతుడి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్న పోలీసులు మృతుడు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు