గొర్రెల కాపరుల పట్ల, గొల్ల కురుమల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందని, దేశంలో, రాష్ట్రంలో గొల్ల కురుమలు ప్రాతినిధ్యం లేని ఏకైక మంత్రి వర్గంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ కొనసాగుతుందని ఇది కులం పట్ల వివక్షకు నిదర్శనమని గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీహరి యాదవ్ మాట్లాడారు. రాజకీయంగా అత్యంత వివక్షపూరితంగా వ్వవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా గొల్ల కురుమ యాదవుల పట్ల గొర్రెల కాపర్ల