మహానంది మండలం అయ్యలురు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు సురేష్ అనే యువకుడిపై కళ్ళలో కారం కొట్టి కత్తులతో దాడి చేశారు. గోపవరం గ్రామం చెందిన సురేష్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో పక్కనే ఉన్న అయ్యలూరు గ్రామంలో డాక్టర్కు వద్దకు వచ్చి చూపించుకోని పోతుండగా గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు, కళ్ళలో కారం కొట్టి కత్తులతో దాడి చేయగ అతను కేకలు వేయడంతో ,పక్కనే ఉన్న స్థానికులు కేకలు వేసుకుని రావడంతో దుండగులు పారిపోయారని,సురేష్ తెలియజేశారు. కళ్ళలో కారం కొట్టడంతో అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ ను 108 వాహనంలో నంద్యాల తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.