గుత్తి ఆర్ఎస్ఎస్ లోని ఎస్సీ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న సోనాక్షి అనే మూడేళ్ల చిన్నారిపై కుక్క దాడి చేసి కరిచింది ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసి కరిచింది. కుక్క దాడిలో గాయపడిన సోనాక్షిని తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, రెహనా గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో కుక్కల బెడద అధికమైందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.