తంబళ్లపల్లె మోడల్ పాఠశాలలో విద్యార్థులకు సొంత నిధులతో మదనపల్లె రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మల్లయ్యకొండ మాజీ చేర్మెన్ కనుగొండ మద్దిరెడ్డి 80 మంది పేద విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు పంపిణీ చేశారు. గురువారం స్థానికంగా 6,7 తరగతులు చదువుకున్న 80 మంది (బాలురు) కు బస్సు పాసులు పంపిణీ చేశారు. క్రమ శిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.