యూరియా కోసం అన్నదాతలు నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, తుంగపాడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. హాలియా-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కొరత ఏర్పడడంతో ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా యూరియా కోసం పనులు మానుకొని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాలకు సకాలంలో యూరియా వేయకపోవడంతో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.