గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల చీడికాడ ఎస్సై బి.సతీశ్ తెలిపారు. కోనాం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖకు చెందిన గోగాడి హరి సంపత్ (20), రేవాడ కిరణ్ (20) గంజాయితో పట్టుబడ్డారు. పెదబయలు మండల సమీప ఒడిశా ప్రాంతం నుంచి 3 కేజీల గంజాయి కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.