నారాయణపేట పట్టణంలో మొదటి విడుత లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సోమవారం నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి స్థానిక సివిఆర్ భవన్ లో ఇండ్లు మంజూరైన 33 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులందరూ త్వరగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. రాబోయే మూడేళ్లలో పక్కా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇండ్ల మంజూరులో కానీ బిల్లు వచ్చినప్పుడు కానీ ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసయ్య, మేన