పెద్ద కడబూరు: పెద్ద కడబూరు గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వహిస్తున్నారని డీవైఎఫ్ఎ మండల కార్యదర్శి రాజు, ఎస్ఎఫ్ఎ మండల కార్యదర్శి విల్సన్ మండిపడ్డారు. శుక్రవారం గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వీధిలైట్లు మన్నిక లేనివి వేస్తున్నారని, డ్రైనేజీలు పూడికతో పేరుకుపోయాయని అన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద పరిపాలన అధికారిణి కౌసల్యకు గ్రామంలోని పలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు