కనిగిరి: గుర్తుతెలియని వాహనం ఢీకొని కనిగిరినియోజకవర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన పొదిలి మండలం కంబాలపాడు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతుని పాడుకు చెందిన బ్రహ్మయ్య, వెలిగండ్లకు చెందిన విష్ణు విజయవాడలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వేసవి సెలవులు కావడంతో వారు బైక్ పై స్వగ్రామాలకు వెళుతుండగా వదిలి మండలం కంబాలపాడు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.