ఈరోజు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నందున చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ధర్మవరం పట్టణానికి చెందిన ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ గౌడ్ ముఖ్యమంత్రిని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధర్మవరంలో బుధవారం వెంకట నారాయణ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గత నెల 7వ తారీకు చేనేత దినోత్సవం సందర్భంగా ఉచితంగా 200 యూనిట్లు చేనేతలకు ఇస్తున్నట్లు ప్రకటించారు కానీ ఇంతవరకు అమలు కాలేదు సంక్షోభంలో కూరుకుపోయిన చేనేతలను ఆదుకోవడానికి నేతన్న భరోసా 25000 నుండి 36 వేలకు పెంచి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.