మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి నకిలీ ఈమెయిల్ ఐడి ద్వారా అసభ్యకర, అశ్లీల సందేశాలు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్న ఓ వ్యక్తిని మందమర్రి పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ మేరకు పట్టణ సిఐ శశిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి పట్టణానికి చెందిన ఓ యువతి ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు మార్చి 2025 నుండి, గుర్తు తెలియని వ్యక్తి ఒక నకిలీ ఈమెయిల్ ఐడి సృష్టించి, పదేపదే అసభ్యకరమైన, అశ్లీలమైన సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేస్తుండేవాడనీ తెలిపారు.