వేటపాలెం మండలం ఆమోదగిరి పట్నంలో బుధవారం రాత్రి విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది.కరెంటు ఫీడర్ వైరు తెగి ఇళ్లపై పడడంతో 50గృహాలలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి.విద్యుత్ మీటర్ల నుండి మంటలు రావడంతో బెంబేలెత్తిన ప్రజలు ఇళ్ళ బయటకు పరుగులు తీశారు.అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.చాలా కిందుగా విద్యుత్ వైర్లు వేలాడుతుండడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు.