కడప నగరంలోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గండికోట వెంకటసుబ్బయ్య గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొని, వెంకటసుబ్బయ్య గారిని మర్యాదపూర్వకంగా సన్మానించారు. నాయకులు మాట్లాడుతూ.. వెంకటసుబ్బయ్య గారి నియామకం వడ్డెర సంఘం గౌరవాన్ని పెంచిందని, ఆయన కృషి వడ్డెర సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని అభినందనలు తెలిపారు.