కేంద్రంతో మాట్లాడం... యూరియా తెప్పించాం... రైతులందరికీ ఇస్తాం... అంటూ అధికారులు చెబుతున్నప్పటికీ రోజు రోజుకు యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్దకు ఉదయం నుండి యూరియా బస్తాలు రావడంతో తండోపతండాలుగా తరలివచ్చిన రైతులు.దీంతో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం రైతుల రాకతో జాతరను తలపిస్తుంది. యూరియా కోసం లైన్లో నిలబడినా కూడా యూరియా దొరకడం లేదు తెల్లవారుజామునుండే వారి వెంట టిఫిన్ బాక్సులు పట్టుకొని మరి ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి తరలివచ్చారు రైతులు. వర్షాలు తగ్గాయి మొక్కజొన్న, పత్తి, వరి కి యూరియా వేసే అదును వచ్చిందన