ప్రకృతితో స్నేహపూర్వకంగా ఉండే జీవనశైలి ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడమే సైక్లింగ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తుషార్ డూడి ఆదివారం అన్నారు. ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుందన్నారు. పర్యావరణాన్ని రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గుండె సంబంధిత రోగాల నివారణ, మధుమేహ నియంత్రణ, ఒత్తిడిని తగ్గించడం, శరీర బరువు నియంత్రణ వంటి సమస్యలను నివారించవచ్చన్నారు.