యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం, జనగాం గ్రామ శివారులో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం బస్సు డ్రైవర్, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చండూరు మీదుగా చౌటుప్పల్ వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు ఒకసారిగా రోడ్డుపైకి రావడంతో కారును తప్పించే బోయి బస్సు కల్వర్టుపైకి దూసుకెళ్లింది. బస్సులో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఆపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తడిసిన నేల కావడంతో బస్సు ముందరి టైరు దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపాడు.