బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓ పి రిజిస్టర్ వెరిఫై చేశారు. ఓపీ కౌంట్, ఫార్మా కౌంట్ మెడికల్ ఆఫీసర్ కౌంట్ మ్యాచ్ కావాలని మెడికల్ ఆఫీసర్ కృష్ణ తేజ ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, ఎనీమియా కేసుల గూర్చి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రి లోపల కలియ తిరిగి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపికగా మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని