పుంగనూరు నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షురాలు అనుప్రియ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడింది .ఈ నేపథ్యంలోశుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి షికారి పాలెంలో ఆమెను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్, నాయకులు నున్నా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు