బాలాపూర్ గణనాథుడిని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి దర్శించుకున్నారు. ఇద్దరు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు వారిని శాలువాతో సన్మానించి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. బాలాపూర్ గణనాథుడు ఎంతో మహిమ గలవాడని కొనియాడారు.