Araku Valley, Alluri Sitharama Raju | Sep 10, 2025
హుకుంపేట మండలం 516 జాతీయ రహదారిలో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయాలు పాలైయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇతర పరిస్థితి విషమంగా ఉండడంతో హుకుంపేట ఆసుపత్రి నుండి పాడేరు జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.