అల్లూరి ఏజెన్సీలో కాఫీ తోటల్లో వస్తున్న బెర్రీబొర్ర తెగులుపై గిరిజన కాపీరైతులంతా అవగాహన కలిగి ఉండాలని జాతీయ ఆదివాసి కాఫీ సంక్షేమ సంఘం నాయకుడు పాలికి లక్కు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో చెట్ల మొదలు భాగంలో వచ్చే ఈ తెగులు కాయకు సోకడంతో కాఫీకి ప్రమాదం ఏర్పడిందని, గిరిజన రైతులు దీనిని గమనించి తెగులు సోకిన వెంటనే సమీప కాఫీ బోర్డ్ అధికారులకు తెలపాలంటూ సూచించారు.