ఏలూరు జిల్లా నూజివీడు మండలం మొకాసా నరసన్న పాలెం గ్రామంలోని పిఎసిఎస్ అధ్యక్షురాలిగా మంగళవారం రాత్రి 7:30 సమయంలో గ్రామంలో బాణాసంచా పేల్చుతూ మేళతాళాలతో బ్యాంకు వద్దకు చేరుకుని యనమదల సృజన మరొక ఇద్దరు సభ్యులు మంగళవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం అధ్యక్షురాలిగా సృజన బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ , ఎంపీపీ, మండలంలో పలువురు బ్యాంక్ ల అధ్యక్షులు మంత్రి కొలుసు పార్థసారథి తనయుడు తదితరులు పాల్గొన్నారు