జ్వరంతో బాధపడుతున్న వారు వైద్యం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్.ఎం.పి., పి.ఎం.పి. లను ఆశ్రయించవద్దని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ చెప్పారు. తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అనంత సాగర్ గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని, తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగిలి పోయిన పాత్రల