*అంగళ్ళు పెద్దకటవలో బాలుని మృతదేహానికి స్పాట్ పిఎం* కురబలకోట మండలం, అంగళ్ళు పెద్ద కటవలో రెండేళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుని తల్లి బార్గవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదివేడు పోలీసులు సోమవారం మృత శిశువుకు స్పాట్ పీఎం నిర్వహించారు. ఆ వివరాలు... మదనపల్లె బసినికొండలో ఉండే దంపతులు భార్గవి, చిన్నరెడ్డప్పలకు ఒక్కగా నొక్క కొడుకు శ్యాంకృష్ణ(02) భార్గవి 15 రోజుల క్రితం పెద్దకటవలోని పుట్టినింటికి వెళ్ళింది. రాత్రి కుటుంబీకులతో కాలక్షేపంచేసింది. మరుసటి రోజు పక్కింటి నీటి సంపులో కొడుకు శవమై ఉండడంతో గుర్తించి అంత్యక్రియలు నిర్వహించారు.