బాపట్లలోని ఫెర్టిలైజర్ షాపులను బాపట్ల పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం షాపులను తనిఖీ చేసిన సీఐ రాంబాబు రికార్డులను పరిశీలించారు. షాపుల్లో యూరియా స్టాకులను పరిశీలించి ఈపాస్ మిషన్ తనిఖీ చేశారు. దుకాణదారులు నిబంధనలు పాటించాలన్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని సీఐ రాంబాబు హెచ్చరించారు.