అనంతపురం జిల్లా వజ్రకరూరు గ్రామ సర్పంచ్ మోనాలిసా ఇటీవల జాతీయస్థాయి అవార్డు సాధించడంతో సోమవారం కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ భవనం నందు జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్ మరియు ఐసిడిఎస్ పిడి నాగమణి తదితరులతో కలసి జిల్లా కలెక్టర్ సర్పంచ్ మోనాలిసా ఘనంగా సన్మానించారు. వజ్ర కరూర్ గ్రామ సర్పంచ్ గా చక్కటి అభివృద్ధి ప్రణాళికతో అభ్యున్నతి సాధించి జాతీయస్థాయి అవార్డు సాధించడం గర్వకారణం అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.