రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం ఇంద్ర నగర్ లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వినాయక మండపం వద్ద గురువారం రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో అతివేగంగా కారు నడిపిన వ్యక్తిని స్థానికులు మందలించడంతో మద్యం మత్తులో ఉన్న యువకుడు సుమారు 20 మందికి పైగా వ్యక్తులతో వారిపై దాడికి దిగాడు. అడ్డు వచ్చిన వారందరిపై దానికి దిగి రాళ్లతో, బీరు బాటిల్లతో తలుపులు బద్దలు కొట్టి ఇండ్లలోకి దూరి దాడికి యత్నించారు. అడ్డువచ్చిన మహిళలని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేర