కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగించడం సరైంది కాదని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ మండారి డేవిడ్ కుమార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలో జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాదుల ఒత్తిళ్లకు లొంగి కేంద్రం ఈ నిర్ణయం చేసిందని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.