కడప నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని SP అశోక్ కుమార్ ప్రారంభించారు. APMF జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, జనసేన నేత రమణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రాలతో ఎస్పీకి స్వాగతం పలికారు. ఊరేగింపులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని SP ఈ సందర్భంగా సూచించారు.