రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు సంతృప్తస్థాయిలో అందాలని, జిల్లా ప్రజలకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు సిద్దించాలని కోరుకుంటూ.. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ నెల "27న "వినాయక చవితి" పర్వదినాన్ని పురస్కరించుకుని... వారు మంగళవారం ఒక ప్రకటనలో.. జిల్లా ప్రజలకు తమ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలు, వేడుకలు.. మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిబింబాలు అని.. ఈ వినాయక చవితి పర్వదినం.. ప్రతి ఒక్కరికీ విఘ్నాలను తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు.