విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంఘం లోనే కొనసాగించాలని,భారత పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఎమయ్యాయని, ఆదివారం విశాఖలో పర్యటిస్తున్నబీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా ప్రజలకు స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ విమల, రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా కార్యదర్శి ఎస్ కె రహిమాన్ తదితరులు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చెయ్యడం లేదు అని చెపుతున్న కూటమి ప్రభుత్వం ఇంకో పక్కన ఉక్కులో 43 విభాగాలను ప్రైవేట్ పరం చేసారన్నారు.