ఎన్నో విద్యార్థి ఉద్యమాలతో సాధించుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరచుగా ర్యాగింగ్ ఘటనలు జరగడం సంబంధిత అధికారుల లోపమని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ఆరోపించారు. నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో PDSU ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పడిన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలకు మరియు ర్యాగింగ్ ఘటనలకు నిలయంగా మారిందని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, గ్రామాల నుండి వచ్చే జూనియర్ విద్యార్థులను సీనియర్ లు ర్యాగింగ్ చేయడం సరికాదన్నారు.