మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట శనివారం ఉదయం 11:00 లకు రైతులు ఆందోళన చేపట్టారు..ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా యూరియా కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అన్నారు.రైతులకు సమయానికి యూరియా అందించకపోతే పంటలు ఎలా పండించుకోవాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చెప్పాడుతమని అన్నారు.ఇప్పటికైనా తమకు యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.