బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని అడవిపాలెం గ్రామం వద్ద కృష్ణ నది లో ఒక గుర్తు తెలియని మృతదేహం ఆదివారం లభ్యమయింది. సుమారు 40 సంవత్సరాలు వయసు కలిగిన పురుషుని మృతదేహం కనిపించగా గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. గ్రామ రెవెన్యూ అధికారి మృతదేహాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రేపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.