నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 26390 కేసులు పరిష్కారం చేయబడ్డాయని జిల్లా జడ్జి GVN భరత లక్ష్మి తెలిపారు. నిజామాబాద్ పాటు, ఆర్మూర్, బోధన్ పరిధిలో PLC 272, క్రిమినల్ 93, సివిల్ 26025 కేసులు పరిష్కారం చేయబడ్డాయి. నిజామాబాద్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రయోజనం చేసి ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.