కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎన్. మనోజ్ రెడ్డి లక్ష్మి నగర్‌లోని టిడ్కో భవనాలను టిడ్కో, ఇంజనీరింగ్, హార్టికల్చర్, మెప్మా శాఖల అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా కమిషనర్ గారు భవనాల పరిసరాలను, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. టిడ్కో గృహాలలోకి వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అక్టోబర్ 2వ తేదీ లోపు ఇళ్లకు అన్ని మరమత్తులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్ల చేయాలని అధికారులను ఆదేశించారు.