రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు నేసేపేట ఏరియా లో రాత్రి వేళ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ నిర్వహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలీసులకు పిర్యాదు చేసిన నేపథ్యంలో మార్కెట్ నిర్వాహకులు, హోల్ సేల్ వ్యాపారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ఇళ్లముందు గలీజు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల రాకపోకలతో రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తున్నారని, మార్కెట్ ను ఇతర ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు.