సెప్టెంబర్ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని పాడేరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ.రాము తెలిపారు. శనివారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో పాడేరు సీఐ డీ.దీనబంధు, ఎస్సై సురేష్, జీ.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట తదితర ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. పాడేరు ప్రధమశ్రేణి జ్యూడిషియల్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.