చిత్తూరు జిల్లా పుంగనూరుపట్టణంలో ప్లాస్టిక్ కవర్లు బాటిళ్లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 90 సంవత్సరాల అనాధ మహిళ మృతదేహం సంత గేటులో మృతి చెంది ఉండదాన్ని గుర్తించే స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారించి సంబంధికులు ఎవరూ రాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ఏఎస్ఐ అశ్వత్ నారాయణ హిందూ సంప్రదాయబద్ధంగా అనాధ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. అనాధ శవానికి అన్నీ తను అంతక్రియలు నిర్వహించిన ఏఎస్ఐ అశ్వత్ నారాయణ పలువురు అభినందించారు.