విద్యార్థి సమస్యల పరిష్కారమే అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య( AIFDS) ముఖ్య లక్ష్యం అని సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందు సిద్దులు పేర్కొన్నారు. శనివారం ఉరవకొండలో ఏర్పాటుచేసిన నూతన మండల కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థి సమాఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, ఫీజు రియంబర్స్ బకాయిలు రూ. 6400 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉరవకొండ మండలం నూతన కమిటీ అధ్యక్షులుగా కుల్లాయ స్వామి, ప్రధాన కార్యదర్శులుగా మధు ఉపాధ్యక్షులుగా సాయి భాస్కర్ సహాయ కార్యదర్శిగా మహేష్ వినయ్ను ప్రకటించారు.