ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలని సీఐటీయూ జిల్లా నాయకులు రెహనా బేగం డిమాండ్ చేశారు. సీఐటీయూ కావలి పట్టణ 5వ మహాసభ ఆదివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్మికులకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.