జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం తాండ్రియాలలో ఓ ప్రైవేట్ బీడీ కంపెనీ ఎదుట శుక్రవారం బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తాము బీడీలు చేస్తుంటే వేతనాల్లో ఇష్టం వచ్చినట్టు కోతలు విధిస్తున్నారన్నారు. వేతనాలు చెల్లించేటప్పుడు తిను బండారాల ప్యాకెట్లు అనవసరంగా కట్టబెడుతున్నారని కార్మికులు మండిపడ్డారు. తిను బండారాల ప్యాకెట్లు తయారీలో కల్తీ నూనె వాడటం వల్ల చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.