కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు బుధవారం తెలిపారు. బైపాస్ రోడ్డులో అలకాపూరి కాలనీ వైపు టీవీఎస్ వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి ట్యాంకర్ లారీ ఢీకొట్టగా దుబ్బెట రాధా (47 ) అనే మహిళ అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి దేహాన్ని జిల్లా ప్రభుత్వం ఆసుపత్రి మార్చురీ గదికి తరలించారు.