కనిగిరి: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పామూరు, కనిగిరి తహసిల్దార్ కార్యాలయాల ఎదుట గురువారం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కనిగిరిలో జరిగిన ధర్నా కార్యక్రమంలో సిఐటియు ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు కేశవరావు మాట్లాడుతూ... అంగన్వాడీ కార్యకర్తలపై పని భారాన్ని ప్రభుత్వం తగ్గించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, 5 జి సిమ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ప్రభుత్వం మార్చాలన్నారు.